![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -103 లో..... మాధవ బాధపడుతున్నాడని మహా తనకి కాఫీ తీసుకొని వెళ్లి ఇవ్వాలని అనుకుంటుంది. కిచెన్ లోకి వెళ్లి కాఫీ రెడీ చేస్తుంటే.. ఏదో బాక్స్ కిందపడిపోతుంది. దాంతో మాధవ వస్తాడు. ఎందుకు అమ్మా ఇవన్నీ అని అంటాడు. మాధవని డైవర్ట్ చెయ్యడానికి నాకు ఉప్మా తినాలని ఉందని మహా అంటుంది. దాంతో ఉప్మా తయారు చేస్తాడు మాధవ. ఇప్పుడు కొంచెం డైవర్ట్ అయిందా పెద్ది అని మహా అడుగుతుంది. హ కొంచెం అయింది అమ్మా అని మాధవ అంటాడు.
సారీ అమ్మా.. నేను నీ ముందు చిన్నపిల్లాడిలాగా ఏడ్చానని మాధవ అంటాడు. అయ్యో అలా అంటారేంటి పెద్ది అని మహా అంటుంది. మరొకవైపు చక్రి డ్రైవింగ్ కి వెళ్తాడు. అప్పుడే మహా ఫోన్ చేసి మాధవ ఏడ్చింది చెప్తుంది. దాంతో చక్రి డిస్సపాయింట్ అవుతాడు. ఆ తర్వాత సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం కాలేజీ నుండి మహాకి కాల్ వస్తుంది. ఆ తర్వాత చక్రి, కేశవ కార్ లో వస్తుంటారు. ఇక నుండి మనం చిన్నపిల్లలా కొట్టుకోవద్దని అనుకుంటారు. మరుక్షణమే మళ్ళీ గొడవపెట్టుకొని కొట్టుకుంటారు.
ఆ తర్వాత అందరు కూర్చొని భోజనం చేస్తారు. మాధవ ని డైవర్ట్ చెయ్యడానికి ఇంట్లో అందరు ట్రై చేస్తారు. ఆ తర్వాత మాధవని నవ్వించడానికి కన్నా చీర చుట్టుకొని వచ్చి డ్యాన్స్ చేస్తాడు. ఇలా కాదురా డ్యాన్స్ చేసేది అని నారాయణ చేస్తాడు. తనతో పాటు ఇంట్లో అందరు డాన్స్ చేస్తారు. ఆ తర్వాత కేశవ ముందు రమణయ్య కావాలనే మా అమ్మాయి పెళ్లి గొప్పగా చేసామని చెప్తాడు. ఇప్పుడు అబ్బాయికి ఫోన్ చేసి అసలు విషయం చెప్తే వీసా రాకముందే విడాకులు ఇస్తాడని కేశవ అనగానే వద్దురా అని కేశవా అని రమణయ్య రిక్వెస్ట్ చేసాడు . ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |